For Money

Business News

లాభాల్లో SGX NIFTY

అమెరికా మార్కెట్లు గత శుక్రవారం ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. అన్ని సూచీలు 1.3 శాతం లాభంతో ముగిశాయి. డాలర్‌ ఇండెక్స్‌ 111 పైన ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌ స్థిరంగా ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నిక్కీ 1.24 శాతం లాభంతో ఉంది. హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ మార్కెట్లు కూడా 1 శాతంపైగా లాభంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. క్రూడ్‌ ఆయిల్ స్వల్పంగా తగ్గినా… బ్రెంట్‌ క్రూడ్‌ 97 డాలర్ల పైనే ఉంది. ఈ నేపేథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి కూడా గ్రీన్‌లో ప్రారంభం కానుంది.