పబ్లిక్ ఇష్యూకు ఆకాష్
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్ ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ కంపెనీని బైజూస్ కొనుగోలు చేసినవిషయం తెలిసిందే. 95 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన బైజూస్… ఈ కంపెనీ విలువను ఇపుడు 350 కోట్ల డాలర్లు నుంచి 400 కోట్ల డాలర్లుగా లెక్కిస్తోంది. ఇదే వ్యాల్యూయేషన్‌కు పబ్లిక్ ఆఫర్‌కు రావాలని భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు ప్రారంభించింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. పబ్లిక్ ఆఫర్ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశముంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా 100 కోట్ల డాలర్లు అంటే రూ. 8000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 2023 మార్చి నెలాఖరుకల్లా ఆకాష్ టర్నోవర్ రెట్టింపు అవుతుందని.. అలాగే మార్జిన్ కూడా 20 శాతం దాటుతుందని భావిస్తున్నారు. ఆకాష్‌కు ఇపుడు దేశ వ్యాప్తంగా 200 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.