NIFTY LEVELS : 17,900 స్టాప్‌లాస్
మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయినా… ఆసియా మార్కెట్లలో ఆ స్థాయి భయం లేదు. యూరో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈలోగా నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 17900 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. క్లోజింగ్ బేసిస్‌లో నిఫ్టి 17900 పైన మద్దతు లభించవచ్చని ఆయన అన్నారు. రిస్క్ తీసుకునేవారు 17900 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. ఈ స్థాయి దిగువకు వెళితే… తదుపరి మద్దతు 17,723 వద్ద లభించవచ్చని అన్నారు. అయితే ప్రస్తుతానికి 17900 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని అన్నారు. 17937 వద్ద నిఫ్టికి మద్దతు లభించే అవకాశముందని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు.