స్థిరంగా SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్ 0.89 శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ సూచీ 0.41 శాతం నష్టపోయింది. డౌజోన్స్ నష్టాలు మాత్రం 0.24 శాతానికే పరిమితమయ్యాయి. డాలర్ ఇండెక్స్ 112 వద్ద స్థిరంగా ఉంది. బాండ్ ఈల్డ్స్ కూడా ఫెడ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే లాభనష్టాలు అర శాతంలోపే ఉన్నాయి. నిన్న 4.5 శాతం పెరిగిన హాంగ్‌సెంగ్ ఇవాళ అర శాతం నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. స్వల్ప నష్టాలు ఉన్నా… మార్కెట్ ఓపెనింగ్ సమయానికి నిఫ్టి స్థిరంగా ఓపెనింగ్ కావొచ్చు. ఇవాళ రాత్రి వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయం వెల్లడి కానుంది.