నైకా ఫలితాలు ఓకే
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామ్ ఆకర్షణీయ పనితీరు కనబర్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 39 శాతం పెరిగి రూ. 1230 కోట్లకు చేరాయి. నికర లాభం రూ. 4.11 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 1.11 కోట్లు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ టర్నోవర్ 7 శాతం పెరిగింది. నైకా షేర్లు ఇవాళ 1152 వద్ద ముగిశాయి. నైకా కంపెనీ ఇటీవలే 1:5 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించింది. ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న ప్రతి ఒక షేరుకు కంపెనీ అయిదు షేర్లు ఇస్తుంది. దీనికి రికార్డ్ డేట్ఈ నెల 11.