నిఫ్టి… తగ్గేదేలే…
యూరప్ బలహీనంగా ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్ రెడ్‌లో ఉన్నా… నిఫ్టి మాత్రం ఉదయం నుంచి పటిష్ఠ లాభాలతో కొనసాగుతోంది. మిడ్ సెషన్ తరవాత కూడా 17961 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 175 పాయింట్ల లాభంతో ఉంది. ఉదయం సెషన్లో నిఫ్టి 17991ని తాకింది. అక్కడి నుంచి కాస్త అటూ, ఇటూగా ట్రేడవుతోంది. 18050లో నిఫ్టికి ఒత్తిడి ఉందని అనలిస్టులు అంటున్నారు. బ్యాంక్ నిఫ్టి అర శాతం లాభంతో ఉన్నా.. హెచ్డీఎఫ్సీ ట్విన్స్‌కు మద్దతు లభించడం విశేషం. అలాగే అనేక మంది అనలిస్టలు, బ్రోకింగ్ సంస్థలు సిమెంట్ షేర్లను సిఫారసు చేస్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ 4శాతంపైగా లాభపడింది. ఉదయం ఆకర్షణీయ లాభాల్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ క్రమంగా బలహీనపడింది. సన్ ఫార్మా ఇవాళ దూసుకు వచ్చింది. అలాగే గ్రాసిమ్ కూడా. ఇక ఎన్టీపీసీలోఉదయం నుంచి నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిఫ్టితో పోలిస్తే నిఫ్టి మిడ్ క్యాప్ ఒక్కటే భారీ లాభాల్లో అంటే 1.36 శాతం లాభంతో ట్రేడవుతోంది. ట్రెంట్, ఇండియన్ హోటల్స్, ఆస్ట్రాల్, అరబిందో ఫార్మా షేర్లు నిఫ్టి మిడ్ క్యాప్‌కు అండగా నిలిచాయి. గత వారం భారీగా క్షీణించిన నైకా షేర్ ఇవాళ 12 శాతం దాకా పెరగడం విశేషం.