మరింతగా క్షీణించిన ఫారెక్స్ నిల్వలు
పెరుగుతున్న డాలర్ దెబ్బకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఫారెక్స్ నిల్వలు) గణనీయంగా తగ్గుతున్నాయి. గడచిన 12 నెలల్లో ఒక్క నెల మినహా ప్రతినెలా ఫారెక్స్ నిల్వలు తగ్గుతున్నాయి.. ఏప్రిల్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగిన కారణంగా ఆ నెలలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. అక్టోబర్ 21వ తేదీతో ముగిసిన వారంలో భారత దేశ ఫారెక్స్ నిల్వలు మరో 385 కోట్ల డాలర్లు తగ్గి 52,452 కోట్ల డాలర్లకు తగ్గాయి. డాలర్ పెరుగుతున్నందున… రూపాయి విలువ మరీ పడిపోకుండా కాపేందుకే ఆర్బీఏ ఏకంగా 11,800 కోట్ల డాలర్లను వినియోగించింది. గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన మన దేశ ఫారెక్స్ నిల్వలు 64,245 కోట్ల డాలర్లు ఉండేవి. ఫారిన్ కరెన్సీ విలువతో పాటు మన దగ్గర ఉన్న బంగారం నిల్వల విలువ కూడా తగ్గడంతో మొత్తమ్మీద మన ఫారెక్స్ నిల్వల విలువ తగ్గుతోంది. కేవలం బంగారం నిల్వల విలువ 24.7 కోట్ల డాలర్ల మేర తగ్గింది. ఇపుడు మన దగ్గర 3,721 కోట్ల డాలర్ల బంగారం ఉంది.