For Money

Business News

17800 వద్ద నిఫ్టి

దాదాపు సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17805ని తాకిన నిఫ్టి 17797వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 60 పాయింట్ల లాభంతో ఉంది. నవంబర్‌ డెరివేటివ్స్‌లోకి రోల్‌ ఓవర్స్‌ పాజిటివ్‌గా ఉన్నాయి. నవంబర్‌ నెల కూడా మార్కెట్‌కు పాజిటివ్‌గా ఉంటుందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టిలో 33 షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి నుంచి మద్దతు లభించడంతో పాటు కొన్ని బ్లూచిప్‌ షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా నిఫ్టి 0.34 శాతం లాభంతో ఉంది. నిఫ్టి బ్యాంక్‌ కూడా ఇదే స్థాయిలో ఉంది. కాని నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీలు మాత్రం నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఆటో రంగ షేర్ల హవా నడుస్తోంది. హీరో మోటోకార్ప్‌, మారుతీ, బజాజ్‌ ఆటో షేర్లు నిఫ్టి టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి. ఇక బ్యాంకుల్లో కొటక్‌ మహీంద్రా బ్యాంకులో జోరు కొనసాగుతోంది. డాలర్‌ రాత్రి పెరగడంతో ఇవాళ మెటల్స్‌ డీలా పడ్డాయి. ఫలితాలు పైకి బాగానే కన్పిస్తున్నా… పనితీరు బలహీనంగా ఉందని వార్తలు రావడంతో ఎస్‌బీఐ కార్ట్స్‌ షేర్‌ ఇవాళ ఆరు శాతం నష్టంతో ట్రేడవుతోంది. అలాగే నైకాలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ షేర్‌ కూడా రూ.1000లోపునకు వచ్చే అవకాశాలు అధికంగా కన్సిస్తున్నాయి. లారస్‌ ల్యాబ్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. రూ.450కి దిగువకు వచ్చేందుకు ఈ షేర్‌ రెడీగా ఉంది. బ్యాంకుల్లో పీఎన్‌బీ ఇవాళ నాలుగు శాతం వరకు లాభపడింది. దివీస్‌ ల్యాబ్‌ కూడా ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ మరో రూ. 39 తగ్గి రూ. 3582 వద్ద ట్రేడవుతోంది. ఇక నిన్న బాగా పెరిగిన రెయిన్‌ బో హాస్పిటల్స్ ఇవాళ స్థిరంగా ఉంది.