NIFTY LEVELS: పడితే కొనండి
ఏడాది నుంచి నిఫ్టి దిగువ స్థాయిలోనే కొనసాగుతోందని… నిఫ్టిని కాస్త దీర్ఘకాలిక ఆలోచనతో కొనేవారు … నిఫ్టి పడే వరకు వెయిట్ చేయాలని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమైనా… వీక్లీ, మంత్లీ ఎక్స్పెయిరీ ఉన్నందున, నిఫ్టి 17,766 లేదా 17710 వద్దకు వస్తుందేమో చూడాలని ఆయన సూచిస్తున్నారు. ఈ స్థాయిలో నిఫ్టి వస్తే కొనుగోలు చేయడం మంచిదని ఆయన అంటున్నారు. నిఫ్టికి 17854 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదురు అవుతుందని అన్నారు. ఈ స్థాయి దాటే వరకు ర్యాలీ కొనసాగుతుందనే నమ్మకం లేదని అన్నారు. కాస్త పొజిషనల్ ట్రేడ్ చేసేవారు నిఫ్టి పడే వరకు వెయిట్ చేయాలని అంటున్నారు. నిఫ్టికి ఇవాళ 17770 కీలకం కానుంది. ఈ స్థాయి పైన ఉన్నంత వరకు పరవాలేదని అంటున్నారు. దిగువకు వస్తే లాభాల స్వీకరణ ఉండొచ్చని అంటున్నారు. అమెరికా మార్కెట్లకు ముఖ్యంగా నాస్డాక్ మన ఐటీ షేర్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఫలితాలు ఈ రంగాన్ని ప్రభావం చూపే అవకాశముంది.