రూ. 50,000 దిగువకు బంగారం
బాండ్లపై ఈల్డ్స్ పెరుగుతుండటంతో బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు డాలర్ బలపడటంతో బంగారం కన్నా.. వెండి భారీగా క్షీణిస్తోంది. ఎంసీఎక్స్ ఫార్వర్డ్ మార్కెట్లో పది గ్రామలు స్టాండర్డ్ బంగారం డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.50000 దిగువకు వచ్చేసింది. ఇవాళ ఉదయం ఈ కాంట్రాక్ట్ రూ.49,924ను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే బంగరాం రూ.230ల వరకు నష్టపోగా, వెండి ధర రూ. 537 వరకు పడిపోయింది. ఎంఎస్ఈ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ రూ. 56,631 వద్ద ట్రేడవుతోంది.