For Money

Business News

80 పాయింట్ల నష్టంతో నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా పటిష్ఠంగా ప్రారంభమైంది నిఫ్టి. కేవలం 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆరంభంలో 17422 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17437 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 75 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి ఇక్కడి నుంచి పెరిగిన తరవాత పడుతుందా లేదా మార్నింగ్‌ సెషన్‌లో క్షీణింస్తుందా అన్నది చూడాలి. 17440 స్థాయిని కాపాడుకుంటే నిఫ్టి స్థిరంగా ఉండొచ్చు. నిఫ్టి మంచి ఫలితాలు ప్రకటించిన నెస్లే ఇండియా నిన్న రెండు శాతం పెరగ్గా, ఇవాళ కూడా ఒక శాతం లాభపడింది. అయితే అనేక కంపెనీలు ఆకర్షణీయ లాభాలను ప్రకటించినా.. ఆ షేర్లు తగ్గుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా అధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడమే. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఇటీవల బాగా పెరిగింది. ఫలితాలు బాగున్నా షేర్‌ 4 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. హిందాల్కోతో పాటు ఇతర మెటల్స్‌లో ఒత్తిడి ఉంది. నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లో ఉన్నాయి…7 షేర్లు లాభాల్లో ఉన్నా… అవి నామమాత్రమే. అధిక ఒత్తిడి నిఫ్టి మిడ్‌క్యాప్‌లో వస్తోంది.ఈ సూచీ 1.2 శాతం క్షీణించింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టి కూడా. ఈ సూచీ 0.76 శాతం నష్టంతో 40064 ప్రాంతంలో ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌లో ఏయూ బ్యాంక్‌ 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌ 3 శాతంపైగా నష్టంతో హావెల్స్ ముందుంది. సాగర్‌ సిమెంట్స్‌ ఓపెనింగ్‌లోనే 5 శాతంపైగా నష్టపోయింది.