భారీ నష్టాల్లో SGX NIFTY

బాండ్ ఈల్డ్స్ ఇపుడు ఈక్విటీ మార్కెట్లకు చుక్కలు చూపుతున్నాయి. 2008 తరవాత తొలిసారి పదేళ్ళ అమెరికా బాండ్ ఈల్డ్స్ 4.1 శాతాన్ని దాటాయి. రెండేళ్ళ బాండ్ ఈల్డ్స్ 4.5 శాతాన్ని దాటయి. మాంద్యం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీలను అమ్మి బాండ్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. రాత్రి డాలర్ కూడా స్వల్పంగా బలపడింది. రాత్రి నాస్డాక్ 0.85 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.67 శాతం, డౌజోన్స్ 0.33 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. టెస్లా అమ్మకాల నిరుత్సాహకరంగా ఉండటంతో ఆ షేర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో అమెరికా ఫ్యూచర్స్ అరశాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి నష్టంతో ప్రారంభం కానుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ కూడా… కాబట్టి నిఫ్టి హెచ్చుతగ్గులు అధికంగా ఉండే అవకాశముంది.