For Money

Business News

2023లో రోల్‌ రాయిస్‌ ఎలక్ట్రిక్‌ కారు

రోల్స్‌ రాయిస్‌ తొలి ఎలక్ట్రిక్‌ కారును వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తోంది. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు మాత్రం 2030లో వస్తుంది. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే స్పెక్ట్రా కారు టూ డోర్‌ కారు కాగా, ఇందులో అదనపు ఆప్షన్స్‌ చాలా ఉంటాయని కంపెనీ పేర్కొంది. డోర్స్‌కు అదనంగా 5876 అదనపు స్టార్స్‌ ఉంటాయని పేర్కొంది. ఈ కారులో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌తో కొన్ని వేల లైట్స్‌ ఉంటాయి. స్పెక్ట్రా కారు మొత్తం బరువు 6559 పౌన్లు ఉంటుందని… ఒకసారి చార్జి చేస్తే 260 మైళ్ళు ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది. 4.4 సెకన్లలో 60 మైళ్ళ వేగాన్ని అందుకునే ఈ కారు … సాధారణ కారు మాదిరిగానే అన్ని ఆప్షన్స్‌ ఉంటాయని.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ లేదని రోల్స్ రాయిస్‌ పేర్కొంది. కారు ధర మాత్రం వెల్లడించలేదు.