భారీ లాభాలతో ముగిసిన మార్కెట్
వరుసగా నాలుగో రోజు కూడా భారీ ర్యాలీతో నిఫ్టి ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ కొనసాగుతుండటంతో… మన ఇన్వెస్టర్లు కూడా మద్దతు కొనసాగించారు. మిడ్ సెషన్ తరవాత ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫ్యూచర్స్ ఒక శాతంపైగా లాభంతో ఉండటంతో మన మార్కెట్లలో ఒత్తిడి కన్పించలేదు. దీంతో నిఫ్టి ఒకదశలో 17,527 స్థాయిని తాకిన నిఫ్టి 17,486 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టితో పాటు మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్ కూడా ఒక శాతంపైగా పెరిగాయి. ఎస్బీఐ ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ నిఫ్టి నెక్ట్స్ 7 శాతం పెరిగింది. బ్యాంక్ నిఫ్టిలో పీఎన్బీ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 శాతం నుంచి 5 శాతంపైగా పెరిగాయి.