54 శాతం లాభంతో లిస్టింగ్స్
బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాపులు నిర్వహించే ఎలక్ట్రానిక్స్ మార్ట్ షేర్లు ఇవాళ బంపర్ లాభాలతో లిస్టయ్యాయి. ఈ కంపెనీ ఈ నెల ఆరంభంలో స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన ఐపీఓ ముగిసింది. ఇష్యూ ఏకంగా 72 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లకు షేర్లు అలాట్ కాలేదు. రూ.59లకు ఈ కంపెనీ షేర్లను అలాట్ చేసింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే రూ.90 వద్ద లిస్టయిన ఈ షేర్ తరవత రూ.91ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా తగ్గి రూ. 84.30 వద్ద ట్రేడవుతోంది. దీర్ఘ కాలిక ఇన్వెస్టర్లు ఈ షేర్లన కొనసాగింవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు కూడా రూ.80 స్టాప్‌లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చని అంటున్నారు. అంటే స్వల్ప కాలిక లాభాలు కోరే ఇన్వెస్టర్లు ఇవాళ బయటపడవచ్చని కొందరు అనలిస్టలు సలహా ఇస్తున్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం తమ పొజిషన్స్‌ను కొనసాగివచ్చు.