నష్టాల్లో SGX NIFTY
అమెరికా మార్కెట్లలో గురువారం వచ్చిన లాభాల్లో సగానికి శుక్రవారం కోత పడింది. నాస్‌డాక్ రికరవీ ఒక రోజు ముచ్చటగా మిగిలింది. శుక్రవారం ఐటీ, టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నాస్‌డాక్ ఏకంగా మూడు శాతంపైగా క్షీణించింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ 2.37 శాతం క్షీణించడంతో… మార్కెట్లు మళ్ళీ గాడిన పడుతాయా అన్న అనుమానం మార్కెట్లలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా డౌజోన్స్ 1.35 శాతం క్షీణించడం అనలిస్టులను అయోమయంలో పడేస్తోంది. ఈనేపథ్యంల ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్ సూచీలు దాదాపు 1.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ కూడా 0.88 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు కూడా సగం శాతం నష్టంతో ఉన్నాయి. ఈనేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా 135 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా నిఫ్టికి ‘17000’ గండం ఎదురు కానుంది. ఈ స్థాయిని కాపాడుకుంటుందో లేదో చూడాలి. నిఫ్టి మాత్రం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కావడం ఖాయం.