అంచనాలకు అనుగుణంగా…
సెప్టెబంర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ ఆకర్షణీయ పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల కాలంలో బ్యాంక్ రూ. 703.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సీఎన్‌బీసీ టీవీ18 సర్వేలో పాల్గొన్న అనలిస్టులు రూ. 637 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. సో… బ్యాంక్ పనితీరు మార్కెట్ అంచనాలను దాటిందన్నమాట. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 53 శాతం పెరిగింది. ఇదే సమయంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా 19 శాతం పెరిగి రూ. 1479 కోట్ల నుంచి రూ. 1762 కోట్లకు చేరింది. అలాగే బ్యాంక్ అసెట్ క్వాలిటీ కూడా మెరుగైంది. జూన్‌తో ముగసిన త్రైమాసికంతో పోలిస్తే ఎన్‌పీఏల శాతం 2.69 శాతం నుంచి 2.46 శాతానికి పెరిగింది.