For Money

Business News

దుమ్ము రేపుతున్న SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లలో వచ్చిన ర్యాలీ ఆసియా మార్కెట్లలో కూడా కొనసాగుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఓపెనింగ్‌ రెండు నుంచి మూడు శాతం క్షీణించగా… మిడ్‌ సెషన్‌లో కోలుకున్నాయి. బంపర్‌ లాభాలతో ముగిశాయి. డౌజోన్స్‌ ఏకంగా 2.83 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 2.6 శాతం లాభపడగా, నాస్‌డాక్‌ కూడా 2.23 శాతం లాభంతో ముగిసింది. రాత్రి డాలర్‌ అనూహ్యం ఒక శాతం క్షీణించింది. మార్కెట్లు పెరగడానికి ప్రధాన కారణం షార్ట్‌ కవరింగ్‌ అని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఇన్వెస్టర్లు ఎంతగా అమ్మారంటే.. కొనేవారే లేని పరిస్థితి కల్పించారని వీరు అంటున్నారు. భారత మార్కెట్లలో కూడా విదేశీ ఇన్వెస్టర్లు 85 శాతం షార్ట్‌, 15 శాతం లాంగ్‌ పొజిషన్స్‌లో ఉన్నారు. ఇక రాత్రి అమెరికా మార్కెట్లలో ర్యాలీకి కొనసాగింపుగా ఆసియా మార్కెట్లనీ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ సూచీలు మూడు శాతం పైగా లాభంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా, తైవాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు కూడా రెండు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 300 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి బంపర్‌ లాభాలతో ప్రారంభం కానుంది.