ప్యాసింజర్ కార్ల మార్కెట్లో బీవైడీ
చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీఎండీ ఇవాళ భారత ప్యాసింజర్ మార్కెట్లో ప్రవేశించింది. ఇప్పటి వరకు ఈ మార్కెట్ టాటా మోటార్స్దే ఆధిపత్యం. అటో3 పేరుతో ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ వాహనాన్ని ఇవాళ మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారును బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో ఈ కార్లను బీవైడీ అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాదిలో 15000 యూనిట్లను అమ్ముతున్నట్లు బీవైడీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెత్సు జాంగ్ తెలిపారు. ఈ కార్ల తయారీకి భారతదేశంలో ఓ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే భారతదేశంలో తమ కంపెనీ 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టామని ఆయన అన్నారు.