స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17184ని తాకిన నిఫ్టి ఇపుడు 17,187 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 53 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐటీ షేర్లలో పెద్ద ఉత్సాహం కన్పించడం లేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లలో పెద్ద ఆసక్తి కన్పించడం లేదు. అయితే విప్రో నిఫ్టి టాప్ గెయినర్ కావడం విశేషం. టీసీఎస్ ఫలితాలను మార్కెట్ ప్రస్తుతానికైతే పట్టించుకోవడం లేదు. అలాగే ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్ అంశం కూడా. ఇండియా సిమెంట్ షేర్ 5 శాతంపైగా నష్టపోయింది. తన సున్నపు రాయి గనులను జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు కంపెనీ అమ్మేసింది. దీని ప్రభావం కంపెనీ షేర్‌పై ఒత్తిడి చూపుతోంది. మార్కెట్ పడినపుడల్లా దిగువ స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేయాలని అనలిస్ట్‌లు సలహా ఇస్తున్నారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ నిఫ్టి నష్టాల్లో ఉండటం విశేషం. ఆటో షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది.