మార్కెట్‌పై బైడెన్ దెబ్బ
ఏదో ఒక కారణంగా భారీ నష్టాలతో కుదేలైన మార్కెట్లపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దెబ్బ పడింది. చైనాకు చెందిన పలు ఎక్ట్రానిక్ వస్తువులపై అమెరికా ఆంక్షలు విధిచింది. ముఖ్యంగా సెమి కండక్టర్లపై ఆయన విధించిన ఆంక్షలతో ఐటీ, టెక్ పరిశ్రమ కంగుతింది. అమెరికా వస్తువులతో తయారు చేసినదైనా సరే…చైనా సెమి కండక్టర్లను వాడరాదని బైడెన్ ఇవాళ ఆంక్షలు విధించారు. దెబ్బకు నాస్డాక్ మరో 1.8 శాతం క్షీణించింది. రెండేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరింది. అనేక ఐటీ, టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇదే నిర్ణయం కారణంగా ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.32 శాతం నష్టంతో ట్రేడవుతోంది. క్రూడ్ ధరలు పెరగడంతో ఎనర్జీ షేర్ల కంపెనీలు కాస్త బలపడ్డాయి. దీంతో డౌజోన్స్ 0.86 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. జర్మనీ డాక్స్ వంటి సూచీలు గ్రీన్‌లో ఉన్నా… యూరో స్టాక్స్ 50 అరశాతంపైగా నష్టంతో ముగిసింది. డాలర్ ఇండెక్స్ అర శాతం పెరిగి 113ను దాటింది. క్రూడ్ అర శాతం నష్టపోగా…బంగారం రెండు శాతం, వెండి మూడు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.