For Money

Business News

భారీ నష్టాల్లో SGX NIFTY

అమెరికా జాబ్‌ డేటా ఉత్సాహంగా ఉండటం, నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు తగ్గడంతో… డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయి. ఇప్పటి వరకు పెంచిన వడ్డీలతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో జోష్‌ తగ్గలేదని తాజా డేటా వెల్లడిస్తోంది. దీంతో ఈసారి అమెరికా కేంద్ర బ్యాంక్‌ 0.75 శాతం చొప్పున వడ్డీని పెంచుతుందని 92 శాతం మంది విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో మళ్ళీ అమ్మకాలు వెల్లువెత్తాయి. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ అన్ని సూచీ భారీ నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ ఏకంగా 3.8 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ2.8 శాతం తగ్గింది. ఇక డౌజోన్స్‌ కూడా 2.11 శాతం చొప్పున పెరగడంతో ఇవాళ ఆసియా మార్కెట్లలో అదే స్థాయి అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సూచీలు దాదాపు రెండు శాతం క్షీణించాయి. ఇక హాంగ్‌ సెంగ్‌ సూచీ 2.16 శాతం నష్టపోయింది. వారం రోజుల తరవాత చైనా మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యాయి. క్రూడ్‌ కూడా 98 డాలర్లకు చేరడంతో భారత మార్కెట్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండనుంది. సింగపూర్‌ నిఫ్టి ఇవాళ 270 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నష్టాలు గనుక 2 శాతం దాటితే నిఫ్టి 17000 దిగువకు వెళ్ళే అవకాశముంది.