పడినా…లాభాల్లోనే…
పూర్తిగా టెక్నికల్‌గానే మార్కెట్ పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు స్పందిస్తూనే.. లాభాల్లో క్లోజైంది. యూరప్ మార్కెట్ల అమ్మకాలతో పాటు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా నిఫ్టిపై ఒత్తిడి పెంచాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటం మరో కారణం. గరిష్ఠ స్థాయి నుంచి వంద పాయింట్ల దాకా పడింది నిఫ్టి. క్రితం ముగింపుతో పోలిస్తే 57 పాయింట్ల లాభంతో 17331 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. చాలా భాగం షార్ట్ కవరింగ్ మంగళవారం జరగడం, ఇవాళ ఉదయం కూడా అదే పరిస్థితి. అయితే 17400 వద్ద కాల్ రైటింగ్ అధికంగా ఉండటంతో నిఫ్టి ఆ స్థాయిని దాటడం చాలా కష్టంగా మారింది. నిఫ్టిలో 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. గత కొన్ని రోజుల నుంచి జెట్ స్పీడుతూ పెరుగుతూ నిఫ్టి గట్టి మద్దతు ఇచ్చిన బ్యాంకు నిఫ్టి ఇపుడు అతి కష్టంతో ముందుకు సాగుతోంది. అయితే మిడ్ క్యాప్ షేర్లలో యాక్టివిటీ జోరుగా ఉంది. కీలక ఇండెక్స్ అర శాతం లోపు లాభాలతో సరిపెట్టుకోగా… నిఫ్టి బ్యాంక్ మాత్రం 1.5 శాతంపైగా లాభంతో క్లోజైంది. ఇవాళ మెటల్ షేర్లు డామినేట్ చేశాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అలాగే ఫార్మాలో ఉత్సాహం తగ్గడంతో చాలా షేర్లు నష్టాలతో ముగిశాయి. మెజారిటీ అదానీ షేర్లు గ్రీన్‌లో ముగిశాయి.