For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. వాల్‌స్ట్రీట్‌లో రాత్రి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. సూచీలు లాభాల్లోకి రావడం తరవా నష్టాల్లోకి జారుకోవడంతో… మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. డాలర్‌ తగ్గుతున్నా… ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌ పెరగడంతో మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. మొత్తానికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అన్ని సూచీల నష్టాలు 0.25 శాతం లోపే ఉన్నాయి. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. నిన్న అయిదు శాతం దాకా పెరిగిన హాంగ్‌సెంగ్‌ ఇవాళ స్వల్ప నష్టంతో ఉంది. జపాన్‌ నిక్కీ 0.93 శాతం పెరగ్గా, న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లకు ఈ వారమంతా సెలవు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఇవాళ కూడా గ్రీన్‌లో ప్రారంభం కానుందన్నమాట.