For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా ఒక మోస్తరు నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల నష్టం చూపగా.. నిఫ్టి మాత్రం 17102 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 40 పాయింట్ల నష్టంతో 17053 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 240 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. క్రూడ్‌ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు వైండ్‌ఫాల్‌ గెయిన్స్‌ పన్నును కేంద్రం తగ్గించడంతో ఓఎన్‌జీసీ షేర్‌ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. గ్యాస్‌ కంపెనీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి.ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ 0.75 శాతం నష్టంతో ట్రేడవుతోంది. కొన్ని ఆటో కంపెనీల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇండియన్‌ హోటల్స్‌ క్రమంగా గ్రీన్‌లో కొనసాగుతోంది. మార్కెట్‌ అనలిస్టుల అంచనా వేసినట్లే దివీస్‌ ల్యాబ్‌ రూ.3800 వైపు పరుగులు తీస్తోంది. నిఫ్టి ఆరంభంలో ప్రతిఘటన స్థాయిల వద్ద ట్రేడవుతున్నందున.. మిడ్‌ సెషన్‌ లోపల నిఫ్టిపై ఒత్తిడి వస్తుందేమో చూడాలి.