NIFTY TRADE: పెరిగితే అమ్మండి
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన హాంగ్‌సెంగ్ మినహా అన్ని మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. డెల్టా వైరస్ కారణంగా జపాన్ నిక్కీ రెండు శాతం వరకు నష్టంతో ట్రేడవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను టీసీఎస్ ప్రకటించింది. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో కంపెనీ విఫలమైంది. అయితే ఆర్డర్ బుక్ ఇంకా ఆరోగ్యకరంగా ఉండటంతో… మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాని అమ్మకాల ఒత్తిడి తప్పదని అనిపిస్తోంది. ఇక నిఫ్టి విషయానికొస్తే… ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,727. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి 15,700 దిగువన ఓపెన్కానుంది. నిఫ్టి ఇక్కడి నుంచి కోలుకుంటే.. అమ్మకాలకు ఛాన్స్‌గా చొప్పొచ్చని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి ఇవాళ అత్యంత కీలక స్థాయి. 15,770 ఈ స్థాయిని దాటకపోతే… నిఫ్టి 15,650కి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ ఇంకా నష్టాల్లోఉండటంతో యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు నిఫ్టి ఈ రేంజ్‌లోకి వచ్చే అవకాశముంది. టీసీఎస్ ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపై పడితే నిఫ్టి 15,635ని కూడా తాకొచ్చు. ఇదే జరిగితే నిఫ్టిని 15,635-15,650 మధ్యలో కొనుగోలు చేయొచ్చు. అయితే స్టాప్‌లాస్ 15600.ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టికి 15,500 వరకు మద్దతు లేదు. నిఫ్టి ఆరంభంలో నిఫ్టి గనుక 15,760 ప్రాంతానికి వస్తే వెయిట్ చేయండి. మరింత పెరిగితే 15800 స్టాప్‌లాస్‌తో అమ్మండి. రిస్క్ తీసుకునే వారు 15,750-15,760 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిన్న దేశీ ఆర్థిక సంస్థలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు పాల్పడ్డారు. సో లెవల్స్ చూసి ట్రేడ్ చేయండి.