For Money

Business News

పెరుగుట… అమ్ముట కొరకే…

మార్కెట్‌ పూర్తిగా టెక్నికల్స్‌ ప్రకారం వెళుతోంది. మొన్నటి దాకా అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా సాగిన మన మార్కెట్లు ఇపుడు తన సొంత దారి వొదిలేసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ మిడ్‌ సెషన్‌ కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. 17037 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే అమెరికాలో డౌజోన్స్‌ కూడా బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళడంతో… యూరో మార్కెట్లలో కూడా అమ్మకాలు వెల్లువెత్తాయి. పైగా డాలర్‌ ఏమాత్రం మెత్తపడటం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చల్లబడకపోతే ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఇంకా జోరుగా ఉంటుందన్న వార్తలతో యూరో మార్కెట్లన్నీ అరశాతం వరకు నష్టపోయాయి. నిఫ్టి మిడ్‌ సెషన్‌లో గ్రీన్‌లో ఉన్నట్లే ఉండి… కరగడం ప్రారంభమైంది. చివరల్లో 16820ని తాకింది. అంటే 200 పాయింట్లకు పైగా పడిందన్నమాట. రేపు మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. దీంతో చివర్లో స్వల్పంగా పెరిగి 16858 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 149 పాయింట్లు నష్టపోయింది. ఒకవిధంగా నిఫ్టి 200 రోజుల చలన సగటుతో పాటు కీలక స్థాయిలను కోల్పోయినట్లే. ఉదయం టెన్నికల్‌ అనలిస్టులు పేర్కొన్నట్లు 16500 ప్రాంతంలో మద్దతు లభిస్తుందేమో చూడాలి. ఇవాళ్టి పతనానికి ప్రధాన కారణం బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం. ఇటీవలకాలంలో భారీగా పెరిగిన ఈ కౌంటర్లలో ఇపుడు ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. నిఫ్టి బ్యాంక్‌ 1.58 శాతం నష్టపోగా, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ కేవలం 0.42 శాతం నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌ 0.62 శాతం క్షీణించింది. నిఫ్టి 15 షేర్లు లాభాల్లో ముగియడం విశేషం. ఏషియన్‌ పెయింట్ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఫార్మా షేర్లకు మద్దతు అందింది. రేపు కూడా నిఫ్టి హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముంది.