నష్టాల్లో SGX NIFTY
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తరవాత ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిన్ని దేశాల మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. స్వల్ప నష్టాలతో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. కొన్ని మార్కెట్లు రెండు శాతం దాకా నష్టపోయాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఆరంభంలో డౌన్స్ నిలకడగా ఉన్నా… క్లోజింగ్‌కల్లా 0.35 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఎస్ అండ్ పీ 0.84 శాతం నష్టపోగా, అత్యధికంగా నాస్‌డాక్ 1.34 శాతం నష్టపోయింది. ఒక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఇవాళ జపాన్ మార్కెట్లకు సెలవు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మార్కెట్లు రెండు శాతం దాకా నష్టంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు స్వల్పంగా గ్రీన్‌లో ఉండగా, హాంగ్‌సెంగ్ స్థిరంగా ఉంది. కోప్సి కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉంది. మరోవైపు సింగపూర్ నిఫ్టి75 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి ఇవాళ 17600 దిగువన ప్రారంభం కానుంది.