స్థిరంగా నిఫ్టి
సింగపూర్ నిఫ్టి మాదిరిగానే నిఫ్టి 15813 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 15,808ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 15,864ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 25 పాయింట్ల లాభంతో 15,859 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టికి ప్రధాన తొలి నిరోధం 15,880 వద్ద ఎదురుకానుంది. నిఫ్టి ఇప్పటికే గరిష్ఠ స్థాయిని తాకిందా లేదా 15,880ని క్రాస్ చేస్తుందా అనేది చూడాలి. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 15900 స్టాప్లాస్తో 15880 ప్రాంతంలో అమ్మొచ్చు. తొలి టార్గెట్ 15800. ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టి 15,784ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టికి తొలి మద్దతు, కొనుగోలు స్థాయి ఇదే. ఈ స్థాయిని కోల్పోతే 15,770కి చేరొచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చు.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఓఎన్జీసీ 123.90 2.44
టాటా మోటార్స్ 352.55 1.86
అల్ట్రాటెక్ సిమెంట్ 6,815.95 1.43
శ్రీసిమెంట్ 27,210.00 0.82
బజాజ్ ఫైనాన్స్ 6,122.00 0.81
నిఫ్టి టాప్ లూజర్స్
టెక్ మహీంద్రా 1,066.20 -0.79
టాటా కన్జూమర్స్ 761.65 -0.61
రిలయన్స్ 2,137.50 -0.59
భారతీ ఎయిర్టెల్ 521.75 -0.42
సిప్లా 971.00 -0.38