52 వారాల కనిష్ఠ స్థాయికి…
అమెరికా ఐటీ, టెక్ రంగంలో భారీ ఒత్తిడి వస్తోంది. అనేక కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. కరోనా సమయంలో అనూహ్య వ్యాల్యూయేషన్స్తో దూసుకుపోయిన నాస్డాక్లో ఇపుడు భారీ కరెక్షన్ వస్తోంది. ఈ ఏడాది నాస్డాక్ ఇప్పటి వరకు 28.28శాతం క్షీణించింది. ఇదే సమయంలో భారత్లో ఉన్న ఐటీ కంపెనీల్లో కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. అనేక షేర్ల వ్యాల్యూయేషన్ 30 శాతం పైగా తగ్గింది. ఇన్ఫోసిస్ ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. ఈ ఏడాది జనవరి 17న రూ.1953ని తాకిన ఈ షేర్ ఇవాళ రూ.1360ని తాకింది. ప్రస్తుతం ఈ షేర్ రూ.1369 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్లో డెలివరీ శాతం 62 శాతంపైన ఉంది. అయినా ఈ ధర వద్ద కొనేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఇక నంబర్ వన్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ కూడా 52 వారాల కనిష్ఠ ధరకు దగ్గర్లోనే ఉంది. ఈ షేర్ కూడా ఈ ఏడాది జవనరి 17న రూ.4043ని తాకింది. ఇవాళ రూ,. 2979ని తాకింది. ఈ షేర్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 2953. అంటే మరో రూ.26 దూరంలో ఉందన్నమాట. చిత్రంగా ఇన్వెస్టర్ల నుంచి ఒక్కో షేర్ రూ. 4500లకు టీసీఎస్ కొనుగోలు చేసింది. అమ్మినవాడు అదృష్టవంతుడు.