ఏబీజీ గ్రూప్ చీఫ్ అరెస్ట్
బ్యాంకులకు రూ . 22,842 కోట్లు ఎగ్గొట్టిన ఏబీజీ షిప్‌యార్డ్ వ్యవస్ధాపక చైర్మన్ రిషి అగర్వాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అగర్వాల్ ఇతరులపై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్ 2005 నుంచి 2012 మధ్య కాలంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 28 బ్యాంకులతో కూడిన కన్సార్షియం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. 2019 ఏప్రిల్ మార్చి 2020 మధ్య ఏబీజీ షిప్‌యార్డ్ అకౌంట్‌ను కన్సార్షియం ఫ్రాడ్‌గా ప్రకటించింది. కంపెనీ ఖాతా 2013 నవంబర్ ౩౦న ఎన్పీఏగా మారింది. దీంతో బకాయిలు రూ 22,842 కోట్లకు చేరాయి. కంపెనీ మోసానికి పాల్పడిందని గుర్తించిన బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. బ్యాంకు రుణాలను కంపెనీ తన విదేశీ అనుబంధ కంపెనీకి దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది.