అద్దె చెల్లిస్తే ఒక శాతం చార్జి
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించే సదుపాయం ఇపుడు అనేక ఫిన్టెక్ కంపెనీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా పేటీఎంలో అద్దెను మీరు క్రెడిట్ కార్డుతో చెల్లించవచ్చు. దీనికి ఒక శాతం కన్నా కాస్త ఎక్కవ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ సౌకర్యాన్ని వాడుతున్నారు. ఇది గమనించిన ఐసీఐసీఐ బ్యాంక్ అలర్ట్ అయింది. తన క్రెడిట్ కార్డును ఉపయోగించి అద్దె చెల్లించే వారికి షాక్ ఇచ్చింది. అలా అద్దె చెల్లిస్తున్న వారిపై కొత్తగా ఒకశాతం చార్జీ వసూలు చేస్తామని ప్రకటించింది. 2022 అక్టోబర్ 20 నుంచి ఇంటి అద్దె చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డుతో చేసే లావాదేవీలపై ఒకశాతం ఫీజు వసూలు చేస్తున్నామని బ్యాంక్ తన కస్టమర్లకు సమాచారం అందించింది. రెడ్ గిరాఫీ (RedGiraffe), మైగేట్ (Mygate), క్రెడ్ (Cred), పేటీఎం (Paytm), మ్యాజిక్బ్రిక్స్ (Magicbricks) పలు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ తమ యూజర్లు క్రెడిట్ కార్డుద్వారా ఇంటి అద్దె చెల్లించడానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే.