17800 దిశగా నిఫ్టి
నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 17794 పాయింట్లను తాకింది. అనేక రంగాలకు చెందిన షేర్లకు భారీ డిమాండ్ వస్తోంది. ఇపుడు నిఫ్టి 17774 వద్ద ట్రేడవుతోంది.క్రితం ముగింపుతో పోలిస్తే 152 పాయింట్ల లాభంతో నిఫ్టి ఉంది. నిఫ్టిలో 49 షేర్లు లాభంలో ఉండగా కేవలం ఒకే ఒక షేర్ నష్టాల్లో ఉంది. ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో భారీ మద్దతు లభిస్తోంది. టైటాన్‌కు కూడా గట్టి మద్దతు వస్తోంది. ఇతర ప్రధాన సూచీలన్నీ ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. మార్కెట్లో భారీ ఎత్తున నిధులు వస్తున్నాయి. సాధారణ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్ల ప్రభావం కన్పించడం లేదు. మార్కెట్లో వరుసగా లాభాల్లో ఉండటంతో… షేర్ల వ్యాల్యూయేషన్‌పై మళ్ళీ చర్చ జరుగుతోంది. కాని ఇన్వెస్టర్లు ఈ అంశాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మార్కెట్ మూడ్ చూస్తుంటే ఫెడ్ మీటింగ్ తరవాత కూడా ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగే అవకాశముంది.