లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇవాళ, రేపు భేటీ కానుంది. రేపు అర్ధరాత్రికి వడ్డీ రేట్లపై నిర్ణయం వెల్లడి కానుంది. మార్కెట్ ఇప్పటికే 0.75 శాతం వడ్డీని డిస్కౌంట్ చేసినట్లు అనలిస్టులు అంటున్నారు. మరి ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగం కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ ఒక మోస్తరు లాభాలతో ముగిసింది. మూడు ప్రధాన సూచీలు 0.7 శాతంపైన ముగిశాయి. డాలర్ చాలా స్థిరంగా ఉంది. వడ్డీ రేట్లను పెంచితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇపుడు కూడా బ్రెంట్ క్రూడ్ ధర 92 డాలర్ల లోపే ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ప్రధాన సూచీలన్నీ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ దాదాపు ఒక శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 137 పాయింట్ల లాభంతో ఉంది. సో నిఫ్టి కూడా ఓపెనింగ్‌లోనే 17700ని దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి.