రేపటి కోసం ఈ మూడు షేర్లు
మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కన్పిస్తున్న అమ్మకాల వెల్లువకు మన మార్కెట్ కూడా స్పందిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తుది నిర్ణయం తీసుకోనే సమయం ఆసన్నమౌతున్నందున… ఒత్తిడి ఇంకా పెరగవచ్చు.నిఫ్టికి తుదపరి మద్దతు 17485 వద్ద ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ టెక్నికల్, డెరివేటివ్ అనలిస్టు అయిన వినయ్ రజని అంటున్నారు. ఈ స్థాయిని కోల్పోతే 17166 వద్ద తదుపరి మద్దతు లభించే అవకాశముంది. ఇక వేళ ఈ స్థాయిని కూడా కోల్పోతే 16850 వద్ద మద్దతుకు అవకాశం ఉందని అంటున్నారు. పెరిగితే 18100 స్థాయిని దాటే ప్రసక్తే లేదన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ గతవారం బాగా పెరిగిన షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి. ఈ షేర్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని… రూ 1125 స్టాప్‌లాస్‌తో రూ. 1331 లక్ష్యంతో కొనవచ్చని అంటున్నారు వినయ్ రజని. గత వారం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేర్ 50 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం… ఈ కంపెనీ పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్లు బాగా పెరగడం. ఇప్పటికే ఈ షేర్ బాగా పెరిగినందున ఈ షేర్ జోలికి వెళ్ళడం అనవసరం. ఇక అమ్మడానికి వినయ్ రజని మూడు షేర్లను సిఫారసు చేశారు. ఒకటి ఓల్టాస్. ఈ షేర్‌ను రూ. 960 స్టాప్‌లాస్‌తో రూ. 860 లేదా రూ. 820 టార్గెట్‌తో అమ్మవచ్చని ఆయన సలహా ఇచ్చారు. రూ. 914-రూ. 945 మధ్య ఈ షేర్‌ను అమ్మొచ్చని అన్నారు. అలాగే ఎల్టీఐ షేర్‌ను రూ. 4378 నుంచి రూ. 4520 మధ్య అమ్మొచ్చని తెలిపారు. రూ. 4570 స్టాప్‌లాస్‌తో రూ. 4150 లేదా రూ. 4000 లక్ష్యంతో అమ్మాలని అన్నారు. ఇక లుపిన్ షేర్‌ను కూడా రూ. 633 నుంచి రూ. 655 మధ్య అమ్మొచ్చని తెలిపారు. ఈ షేర్‌ను రూ. 666 స్టాప్‌లాస్‌తో రూ. 590 లేదా రూ. 565 టార్గెట్‌తో అమ్మవచ్చని అన్నారు.