For Money

Business News

వంద పాయింట్లకు పైగా నష్టం

అమెరికా మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ఆర్థిక గణాంకాలన్నీ చాలా పాజిటివ్‌గా ఉండటంతో… ధరల అదుపు చేయడానికి ఫెడరల్‌ బ్యాంక్‌ 0.75 శాతం వడ్డీని పెంచడంతో పాటు దీర్ఘకాలం పాటు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తేవాలనే యోచనలో ఉంది. దీంతో డౌజోన్స్‌లో కూడా ఒత్తిడి పెరుగుతోంది. రాత్రి నాస్‌డాక్‌ మరో 1.43 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.13 శాతం క్షీణించింది. డౌజోన్స్‌ 0.53 శాతం తగ్గింది. డాలర్ ఎక్కడా మెత్తపడటం లేదు. ఇప్పటికీ 109 పైనే ఉండటంతో క్రూడ్‌ తగ్గినట్లు కన్పించినా.. ఫలితం అంతంత మాత్రేమ ఉంటోంది. చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకున్నా… ఈక్విటీ మార్కెట్లు మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియా, హాంగ్‌సెంగ్ సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. మిగిలిన మార్కెట్ల నష్టాలన్నీ అర శాతంపైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి కూడా 100 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ 17800 దిగువన ప్రారంభం కానుంది.