For Money

Business News

17,900 దిగువన ముగిసిన నిఫ్టి

వీక్లీ డెరివేటివ్స్‌ ప్రభావం ఇవాళ నిఫ్టిపై స్పష్టంగా కన్పించింది. చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు 10 గంటల సమయంలోనే తమ పొజిషన్స్‌ స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పడిన నిఫ్టి తరవాత 17865ని తాకింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటంతో స్వల్పంగా కోలుకుని 17950ని దాటింది. కాని చివర్లో పొజిషన్స్‌ స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో నిఫ్టి భారీగా క్షీణించి 17861ని తాకింది. క్లోజింగ్‌ ముందు స్వల్పంగా పెరిగినా 17877 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 126 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి ఏకంగా 39 షేర్లు నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా నిఫ్టికి అండగా ఉన్న బ్యాంకులు ఇవాళ హ్యాండిచ్చాయి. నిఫ్టి బ్యాంక్‌ సూచీ 0.42 శాతం క్షీణించింది. దీని ప్రభావం నిఫ్టిపై కన్పించింది. అలాగే ఐటీ, హిందాల్కో వంటి మెటల్స్‌ కూడా దెబ్బతీశాయి. అయితే నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.38 శాతం పెరగ్గా, అదానీ గ్రూప్‌ షేర్ల పుణ్యమా అని నిఫ్టి నెక్ట్స్‌ 0.62 శాతం పెరిగింది. నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్‌, అంబుజా సిమెంట్, అదానీ గ్రీన్‌ షేర్లు ఉన్నాయి. ఇవాళ లిస్టయిన తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) షేర్‌ ఇవాళ రూ. 519ని తాకినా.. రూ. 508.45 వద్ద క్లోజైంది. ఈ షేర్‌ను రూ. 510 ధరకు కేటాయించారు.