ఎస్బీఐ షాక్.. భారీగా పెరగనున్న ఈఎంఐలు
రుణ గ్రహీతలకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్ల పెంపు ఇంకా ఆర్బీఐ నిర్ణయం తీసుకోకముందే… ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రుణాలపై కనీస వడ్డీ రేటు (బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు-బీపీసీఎల్) ను 0.75 శాతం పెంచుతున్నట్లు ఇవాళ వెల్లడించింది. దీంతో ఇపుడు ఎస్బీఐ కనీస డ్డీ 13.45 శాతానికి చేరింది. దీంతో బీపీసీఎల్‌తో లింక్ చేసిన రుణాలపై వడ్డీ రేట్లు వెంటనే అమల్లోకి వస్తాయి. వాస్తవానికి గత జూన్‌లోనే ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుతం 12.75 శాతం ఉన్న బీపీసీఎల్ ఇక నుంచి 13.45 శాతం కానుందని బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే బేస్ రేటును కూడా 0.75 శాతం చొప్పున బ్యాంక్ పెంచింది. దీంతో ఇక నుంచి బేస్ రేటు 8.7 శాతం కానుంది. దీంతో ఈఎంఐలన్నీ పెరగనున్నాయి. మూడు నెలలకు ఒకసారి బ్యాంక్ బేస్ రేటును, బీపీసీఎల్ రేటును సవరిస్తోంది.