For Money

Business News

నిఫ్టికి బ్యాంకుల అండ

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18096 పాయింట్లను తాకింది. ఇపుడు 78078 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్‌ 300 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా బ్యాంకు షేర్లదే హవా. నిఫ్టి బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.94 శాతం లాభంతో ఉంది. ఇతర ప్రధాన సూచీలు కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో 36 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇన్ఫోసిస్‌ ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. నిన్న నిఫ్టి లూజర్స్‌లో ఈ షేర్‌ టాప్‌లో ఉంది. ఇక మెటల్స్‌ కూడా ఇవాళ ఒత్తిడి కన్పిస్తోంది. హిందాల్కో, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ముందున్నాయి. నిన్న 9 శాతం దాకా పెరిగిన వేదాంత షేర్‌ ఇవాళ కూడా 4 శాతం పెరిగింది. నిఫ్టి మిడ్‌క్యాప్‌లో 25 షేర్లు ఉండగా.. 20 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.