అమ్మకానికి కేర్ హాస్పిటల్?
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేర్ హాస్పిటల్ మరోసారి చేతులు మారనుంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ యాజమాన్యం టీపీజీ గ్రోత్ అనే సంస్థకు చెందిన ఎవర్‌కేర్ చేతిలో ఉంది. ఈ హాస్పిటలో మెజారిటీ వాటా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ హాస్పిటల్లో మెజారిటీ వాటా తీసుకునేందుకు బ్లాక్ స్టోన్, సీవీసీ క్యాపిటల్, టెమాసెక్‌తో పాటు మ్యాక్స్ హెల్త్‌కేర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడదత బిడ్డింగ్ పూర్తయిందని, త్వరలోనే వచ్చిన బిడ్స్‌లో కొన్నింటిని షార్ట్ లిస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ హాస్పిటల్ డీల్ రూ.7,500 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే స్థాయిలో డీల్ కుదిరితే హాస్పిటల్ రంగంలో ఇదే అతి పెద్ద డీల్ అవుతుంది. కేర్ హాస్పిటల్‌కు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో మొత్తం 17 హాస్పిటల్స ఉన్నాయి. కేర్ హాస్పిటల్స్ వార్షిక ఆదాయం 37.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.3000 కోట్ల దాకా ఉంటోంది.