సూపర్ లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు ఉత్సాహంగా ముగిశాయి. ఆరంభంలో ఒక మోస్తరుగా ఉన్న లాభాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. వరుసగా ఏడు రోజుల నష్టాల తరవాత నాస్డాక్ రాత్రి 2.14 శాతం లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.83 శాతం, డౌజోన్స్ 1.4 శాతం లాభంతో ముగిశాయి. నిన్న రాత్రి భారీగా క్షీణించిన క్రూడ్ ఆయిల్… ఇవాళ స్థిరంగా ఉంది. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గి 110 దిగువకు చేరింది. ఇక ఆసియా మార్కెట్లలో హాంగ్‌సెంగ్ తప్ప… మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.97 శాతం లాభంతో ఉంది. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా సూచీలు ఒక శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఇతర సూచీలు గ్రీన్‌లోనే ఉన్నా… లాభాలు అర శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తతం 102 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17700ను దాటే అవకాశముంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ సెటిల్మెంట్ ఉంది.