అందరికీ సీల్ట్ బెల్ట్ తప్పనిసరి
ఇక నుంచి కారు వెనుక సీట్లలో కూర్చొనే ప్రయాణీకులు కూడా కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ వారం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. వెనుక సీట్లో కూర్చున్న ఆయన సీటు బెల్టు పెట్టుకోలేదని తెలిసింది. దీంతో ప్రభుత్వం వెనుక సీట్లలో కూర్చునేవారికి కూడా సీటు బెల్టు తప్పనిసరి చేసింది. లేకుంటే జరిమానా విధిస్తామని పేర్కొంది.