నిఫ్టి: ఇవాళా అమ్మినవారికి వేడుక
మొత్తం మార్కెట్ మూడ్‌ను యూరో మార్కెట్లు దెబ్బతీశాయి. రాత్రి అమెరికా స్థిరంగా ముగియగా, ఆసియా మార్కెట్లు మాత్రం ఒక మోస్తరు లాభాలతో ట్రేడయ్యాయి. దీంతో నిఫ్టి కూడా లాభాలతో ప్రారంభమై క్రమంగా పెరిగి ఒకదశలో తొలి ప్రతిఘటన స్థాయి 11830ని దాటి 15839ని చేరింది. అధిక స్థాయిలో నిలదొక్కుకోలేక… యూరో మార్కెట్లు ప్రారంభమైన వెంటనే క్షీణించడం ప్రారంభమైంది. ఒకదశలో 15708ని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 15,721 వద్ద 27 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇవాళ మార్కెట్ పూర్తిగా ఆల్గో ట్రేడింగ్‌కు పరిమితమైంది. ఉదయం ఊహించినట్లు 15830పైన ఒత్తిడికి గురైంది. 15750 ప్రాంతంలో మద్దతు వస్తుందని అనుకున్నా… మరో మద్దతు స్థాయి 15720కి క్షీణించింది. ఉదయం అధిక స్థాయిలో నిఫ్టిని షార్ట్ చేసిన డే ట్రేడర్లకు భారీ లాభాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవాళ బ్యాంక్ నిఫ్టి బాగా దెబ్బతీసింది. మిడ్ క్యాప్ షేర్లలో కూడా ట్రేడింగ్ చాలా డల్‌గా సాగింది. దాదాపు క్రితం ముగింపు వద్దే నిఫ్టిమిడ్ క్యాప్ క్లోజైంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
కోల్ ఇండియా 146.35 1.28
రిలయన్స్ 2,112.00 1.16
దివీస్ ల్యాబ్ 4,404.60 1.11
ఇన్ఫోసిస్ 1,580.00 1.08
టెక్ మహీంద్రా 1,096.70 0.79
నిఫ్టి టాప్ లూజర్స్
శ్రీ సిమెంట్ 27,600.00 -1.90
బజాజ్ ఫిన్ సర్వ్ 12,076.20 -1.82
పవర్‌గ్రిడ్ 232.45 -1.50
యూపీఎల్ 794.00 -1.42
ఐసీఐసీఐ బ్యాంక్ 631.45 -1.35