17600పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 17612 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 72 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇతర ప్రధాన సూచీలన్నీ అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 30 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. హిందాల్కో 2 శాతం లాభంతో నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. అపోలో హాస్పిటల్స్ 1.25 శాతం నష్టంతో నిఫ్టి టాప్ లూజర్‌గా ఉంది. నిఫ్టి నెక్ట్స్ కాస్త పటిష్ఠంగా ఉంది. ఈ విభాగంలో సెయిల్, జొమాటొ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాల్లో ఉండగా పేటీఎం నాలుగు శాతం లాభంతో ఉంది. పీటీఎం ఆఫీస్‌పై ఈడీ దాడులు జరగడం దీనికి ప్రధాన కారణం. ఇక నిఫ్టి మిడ్ క్యాప్‌లో ఆస్ట్రాల్ హవా కొనసాగుతోంది. ఇవాళ కూడా ఈ షేర్ 2 శాతం పెరిగింది. బ్యాంక్ షేర్లలో ఫెడరల్ బ్యాంక్ 1.3 శాతం లాభంతో టాప్‌లో ఉంది. ఎన్డీటీవీలో అప్పర్ సర్క్యూట్ ఇవాళ కూడా కొనసాగుతోంది. ఈ షేర్ ఏడాది క్రితం రూ. 71 ఉండగా.. ఇవాళ రూ. 545.75 వద్ద ట్రేడవుతోంది.