లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. ప్రధాన మార్కెట్లలో పెద్ద మార్పుల్లేవ్. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా… లాభాలు నామమాత్రమే. నాస్డాక్ 0.19 శాతం లాభంతో ముగిసింది. ఇతర సూచీల్లో మార్పు లేదు. అంతకుముందు యూరో మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 0.43 శాతం లాభంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. చాలా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా … అన్నీ నామ మాత్రపు లాభాలే. జపాన్, హాంగ్‌సెంగ్ సూచీలు రెడ్‌లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దీంతో నిఫ్టి కూడా గ్రీన్‌లో లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది. 15800 స్థాయిని దాటుతుందేమో చూడాలి.