For Money

Business News

NIFTY TRADE: 15,800పైన నిలబడుతుందా?

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉండటం, డాలర్‌తో పాటు క్రూడ్‌ ధరలు పెరగడం మన మార్కెట్లకు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రిలయన్స్‌తో కొన్ని కౌంటర్లు ఇవాళ నిఫ్టికి మద్దతు గా నిలిచినా 15800పైన నిఫ్టి నిలబడుతుందా అన్నది అనుమానంగా ఉంది. చాలా రోజుల తరవాత దాదాపు అన్ని రకాల టెక్నికల్‌ సూచీలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. నిఫ్టి 15790- 15,800 మధ్య ఓపెన్‌ కావొచ్చు. ఇక్కడి నుంచి నిఫ్టి ఏ మేరకు పెరుగుతుందో చూడండి. ఒకవేళ 15,815-15,825 ప్రాంతానికి వస్తే నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,825 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. 15,830 దాటితే అమ్మొద్దు. మరి ఈ స్థాయిలో నిఫ్టిని అమ్మితే… స్వల్ప లాభాలకే పరిమితం అవ్వండి. నిఫ్టికి ఇవాళ 15,770 కీలకం. ఈ స్థాయిపైన నిఫ్టికి బలం ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి వస్తే స్వల్ప లాభాలైనా స్వీకరించండి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు కాస్సేపు వెయిట్‌ చేయొచ్చు.ఎందుకంటే 15,770 దిగువకు వస్తే నిఫ్టికి 15,720 వరకు మద్దతు లేదు. నిఫ్టిని కొనాలనుకునేవారు 15710-15720 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్‌ 15,690. కాని ఈ స్థాయికి నిఫ్టి రావడం కష్టమే. కాబట్టి అధిక స్థాయిలో అమ్మినవారు 15,750పైనే లాభాలు స్వీకరించడం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టి కొనుగోలు చేయకపోవడమే బెటర్‌.