కొనసాగుతున్న నష్టాల జోరు
వాల్స్ట్రీట్లో నష్టాల జోరు కొనసాగుతోంది. గత శుక్రవారం దాదాపు నాలుగు శాతం క్షీణించిన నాస్డాక్ ఇవాళ మరో 0.78 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ అర శాతం, డౌజోన్స్ 0.32 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అంతకుమునుపు యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే చాలా వరకు నష్టాలు రికవరయ్యాయి. ఇదే ట్రెండ్ వాల్స్ట్రీట్లో కొనసాగితే… క్లోజింగ్కల్లా కోలుకోవచ్చు. మరోవైపు కరెన్సీ మార్కెట్లో డాలర్ నిలకడగా ఉంది. డాలర్ ఇండెక్స్ 108.69 వద్ద ట్రేడవుతోంది. పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ కూడా 3.1 శాతంపైనే ఉన్నాయి. ఆందోళన కల్గించే అంశమేమిటంటే క్రూడ్ ధరలు ఇవాళ కూడా మూడు శాతం పెరగడం. బ్రెంట్ క్రూడ్ ధర 102 డాలర్లను దాటింది. ఒక బులియన్ స్థిరంగా ఉంది. ఔన్స్ బంగారం ధర 1750 డాలర్ల వద్ద ఉంది.