షాపింగ్‌తో పాటు వాట్సప్‌లోనే చెల్లింపులు
ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా జియో మార్ట్ షాపింగ్ చేస్తే.. పేమెంట్ కోసం షాపింగ్ పేజీ నుంచి బయటకు రావాల్సి వచ్చేది. వాట్సాప్-జియో భాగస్వామ్యంతో ఇపుడు కొత్త టూల్ రాబోతోంది. దీంతో షాపింగ్ చేసిన పేజీలోనే చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయొచ్చని రిలయన్స్ రిటైల్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ ఏజీఎంలో ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. జియో మార్ట్‌ను యూజర్లకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్‌తో కలిసి ఇన్-యాప్ షాపింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త టూల్ ద్వారా యూజర్లు నిత్యావసరాలు, ఇతరత్రా సామాగ్రిని జియో మార్ట్ నుంచి కొనుగోలు చేసి, యాప్‌లోనే చెల్లింపులు చేయొచ్చు. అలానే కస్టమర్ వాట్సాప్ ద్వారా జియో మార్ట్‌లో గతంలో చేసిన కొనుగోళ్ళ వివరాలను కూడా ఇందులో చూసుకోవచ్చు.