గ్రీన్‌లో ముగిసిన నిఫ్టి
ఆరంభంలో, మిడ్ సెషన్లో స్వల్ప ఒత్తిడికి లోనైన నిఫ్టి గ్రీన్‌లో ముగిసింది. రోజంతా వంద పాయింట్ల వ్యత్యాసంతో ట్రేడైంది. ఒకదశలో 17499ని తాకినా.. 17604 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 27 పాయింట్లు పెరిగింది. 26 నిఫ్టి షేర్లు లాభాల్లో క్లోజ్ కాగా, 24 నష్టాల్లో ముగిశాయి. ఇతర సూచీలన్నీ గ్రీన్‌లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టి బ్యాంక్ 0.88 శాతం, నిఫ్టి నెక్ట్స్ 0.6 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టిలో అపోలో హాస్పిటల్స్ మూడు శాతంపైగా లాభంతో ముగిసింది. దివీస్ ల్యాబ్ రూ.3500 లోపు ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌లో బంధన్ బ్యాంక్ ఆరు శాతం లాభపడింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ నాలుగు శాతం, అదానీ ట్రాన్స్ మిషన్ 2.7 శాతం లాభంతో ముగిశాయి. అదానీ గ్రీన్‌లో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగింది. జొమాటో కూడా 3.65 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి మిడ్ క్యాప్‌లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5 శాతంపైగా లాభంతో టాప్‌లో నిలిచింది. లారస్ ల్యాబ్ 1.5 శాతం దాకా నష్టపోయింది. మిడ్ క్యాప్ బ్యాంకులకు గత కొన్ని రోజులుగా మార్కెట్లోచాలా గట్టి మద్దతు లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ ఇవాళ ఒక్క రోజూ దాదాపు నాలుగు శాతం లాభంతో ముగిసింది. అనేక కౌంటర్లు చివరి గంటలో భారీగా పెరిగాయి. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా రోలోవర్స్ బాగానే ఉన్నట్లు కన్పిస్తోంది.