నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. డౌజోన్స్ 0.3 శాతం నష్టపోగా, ఇతర సూచీలు దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిశాయి. నిన్న ఈక్విటీ మార్కెట్లలో పెద్ద మార్పు లేకున్నా ముడి చమురు ధరలు మాత్రం నాలుగు శాతం దాకా పెరిగాయి. డాలర్ దాదాపు 109దాకా ఉంటోంది. ఇవి రెండు మన మార్కెట్లకు ప్రతికూల అంశాలు. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్, చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా, మిగిలిన మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. చైనా పీఎంఐ డేటా చాలా నిరుత్సాహకరంగా ఉంది. జపాన్ మార్కెట్ కోలుకుంటుందేమో చూడాలి. అమెరికా ఫ్యూచర్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 58 పాయింట్ల నష్టంతో ఉంది. మార్కెట్ ప్రారంభమయ్యే సరికి ఈ నష్టాలు తగ్గుతాయేమో చూడాలి.